ఆ ప్రశ్నకి సమాధానమే.. ‘టక్కర్‌’

‘‘నన్ను ఇప్పటిదాకా ఓ లవర్‌బాయ్‌...చాక్లెట్‌బాయ్‌లానే చూస్తూ ప్రేమించారు. ఈ సినిమాతో తొలిసారి ఓ యాక్షన్‌ హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నా.

Published : 30 May 2023 00:40 IST

‘‘నన్ను ఇప్పటిదాకా ఓ లవర్‌బాయ్‌...చాక్లెట్‌బాయ్‌లానే చూస్తూ ప్రేమించారు. ఈ సినిమాతో తొలిసారి ఓ యాక్షన్‌ హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నా. ఇదొక విభిన్నమైన అనుభవం’’ అన్నారు సిద్ధార్థ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘టక్కర్‌’. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. కార్తీక్‌ జి.క్రిష్‌ దర్శకత్వం వహించారు. టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మాత. జూన్‌ 9న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో చిత్రబృందం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది. సిద్ధార్థ్‌ మాట్లాడుతూ ‘‘నేను ఇప్పటివరకూ ఓ ప్రత్యేకమైన జోనర్‌ సినిమాలే చేశా. ఒక పాత్ర ఇస్తే ఆరంభం నుంచి చివరి వరకూ సిద్ధార్థ్‌లా కాకుండా ఒక పాత్రలాగే కనిపించేలా నటించా. ఈ క్రమంలో చాలా మంది ‘ఎందుకు నువ్వు కమర్షియల్‌ సినిమా చేయడం లేదు’ అని అడుగుతుంటారు. ఆ ప్రశ్నకి సమాధానమే... ‘టక్కర్‌’. తొలిసారి మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుని కండలు పెంచి... పోరాట ఘట్టాల్లో నటించా. కొత్తతరానికి నచ్చేలా ఓ మంచి ప్రేమకథ కూడా ఇందులో ఉంది. మొత్తంగా ఇందులో ఓ కొత్త సిద్ధార్థ్‌ని చూస్తారు ప్రేక్షకులు’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని