‘జైలర్‌’ మరోసారి బరిలోకి..

ఆగస్టులో ‘జైలర్‌’తో సందడి చేయనున్నారు అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది.

Published : 30 May 2023 05:21 IST

గస్టులో ‘జైలర్‌’తో సందడి చేయనున్నారు అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మోహన్‌లాల్‌, శివ రాజ్‌కుమార్‌, తమన్నా, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో రజనీ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం రజనీకాంత్‌ మరోసారి రంగంలోకి దిగినట్లు సమాచారం. నాలుగైదు రోజుల పాటు సాగే చిన్న షెడ్యూల్‌ ఇదని.. ఇందులో భాగంగా రజనీపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. ఈ షెడ్యూల్‌లో జాకీ ష్రాఫ్‌తో పాటు మరికొందరు ప్రధాన తారాగణం పాల్గొనన్నుట్లు తెలుస్తోంది. ఈ ప్రస్తుత షెడ్యూల్‌ ముగిసిన వెంటనే సినిమా పూర్తయినట్లు ప్రకటించనున్నారట. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో ముత్తువేల్‌ పాండియన్‌ అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు రజనీ. ఈ చిత్రం నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకొని ఆగస్టు 10న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని