Samantha: హాలీవుడ్‌లో సమంత చెన్నై స్టోరీ

‘ది ఫ్యామిలీ మ్యాన్‌’, ‘సిటాడెల్‌’లతో హిందీ ప్రేక్షకులకు దగ్గరైన అగ్ర కథానాయిక సమంత తన హాలీవుడ్‌ చిత్రానికి సిద్ధమవుతోంది.

Updated : 31 May 2023 14:15 IST

‘ది ఫ్యామిలీ మ్యాన్‌’, ‘సిటాడెల్‌’లతో హిందీ ప్రేక్షకులకు దగ్గరైన అగ్ర కథానాయిక సమంత తన హాలీవుడ్‌ చిత్రానికి సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి ‘చెన్నై స్టోరీ’ అనే పేరు ఖరారైనట్లు సమాచారం. ‘బాఫ్టా’ పురస్కార విజేత ఫిలిప్‌ జాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. విల్‌ మచిన్‌ నిర్మాత. రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కే ఈ చిత్రంలో సమంతకి జోడీగా వివేక్‌ కల్రా నటించనున్నారు. లండన్‌లో స్థిరపడ్డ భారతీయ మూలాలున్న ఒక ఇంగ్లిష్‌ యువకుడు నిఖిల్‌ (వివేక్‌ కల్రా) తన తండ్రిని వెతుక్కుంటూ చెన్నై వస్తాడు. అక్కడ తనకి అను (సమంత) పరిచయం అవుతుంది. నిఖిల్‌ తండ్రిని వెతకడానికి సాయం చేయడానికి ఆమె ఒప్పుకుంటుంది. తర్వాత వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌ చెన్నై, బ్రిటన్‌లలో ఉంటుందని సినీవర్గాలు తెలిపాయి.  తూర్పు, పశ్చిమ దేశాల సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ చిత్ర షూటింగ్‌ చెన్నై, బ్రిటన్‌లలో ఉంటుందని సినీవర్గాలు తెలిపాయి. ఈ హాలీవుడ్‌ సినిమా ఇంగ్లిష్‌, తమిళ భాషల్లో విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని