తండ్రీ తనయుల ‘ఆపరేషన్‌ రావణ్‌’

‘పలాస 1978’ ఫేమ్‌ రక్షిత్‌ అట్లూరి కథానాయకుడిగా నటించగా.. ఆయన తండ్రి వెంకట సత్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆపరేషన్‌ రావణ్‌’.

Published : 01 Jun 2023 01:41 IST

‘పలాస 1978’ ఫేమ్‌ రక్షిత్‌ అట్లూరి కథానాయకుడిగా నటించగా.. ఆయన తండ్రి వెంకట సత్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆపరేషన్‌ రావణ్‌’. సంకీర్తన విపిన్‌ కథానాయిక. నటి రాధిక కీలక పాత్రలో నటించారు. ధ్యాన్‌ అట్లూరి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రచార చిత్రాన్ని హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ,  మారుతి, కల్యాణ్‌కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ ‘‘తండ్రి దర్శకత్వంలో తనయుడు నటించడం అరుదు. ఆ అరుదైన ఘటన ఈ సినిమాకి జరిగింది. ఫస్ట్‌ థ్రిల్‌ పేరుతో విడుదల చేసిన ప్రచార చిత్రం చాలా బాగుంది’’ అన్నారు. రక్షిత్‌ మాట్లాడుతూ ‘‘మా నాన్న పేరు వెంకట సత్య వరప్రసాద్‌. పరిశ్రమలో అందరికీ ప్రసాద్‌గానే తెలుసు. ఆయన దేశం మొత్తం గర్వించేలా ఈ సినిమాని తెరకెక్కించారు. దర్శకత్వం గురించి క్షుణ్ణంగా తెలుసుకుని.. అనుభవం ఉన్న అగ్ర దర్శకులు ఎలా తీస్తారో అలా తీశారు. మరో స్థాయిలో ఉంటుంది ఈ చిత్రం’’ అన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని