Miss Shetty Mr Polishetty: ‘హత విధి’.. ఏంటీ డామేజీ

ధనుష్‌ మంచి నటుడే కాదు..గాయకుడు కూడా. ‘వై దిస్‌ కొలవరి’ లాంటి పాటలతో తనలోని గాయకుడి సత్తా ఏంటో చూపెట్టాడు.

Updated : 01 Jun 2023 11:45 IST

ధనుష్‌ మంచి నటుడే కాదు..గాయకుడు కూడా. ‘వై దిస్‌ కొలవరి’ లాంటి పాటలతో తనలోని గాయకుడి సత్తా ఏంటో చూపెట్టాడు. ఇప్పుడు మరోసారి ఆయన పాటందుకున్నాడు. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ సినిమాలోని ‘‘వాటే డామేజీ, చెవిలో క్యాబేజి..ఎట్టా కుదురు.. టేక్‌ ఇట్‌ ఈజీ...చెరిగి పోయింది స్మైలీ ఎమోజీ, లైఫ్‌ డైరీలో మిగిలింది ఖాళీ పేజీ...’’ అంటూ జీవితంపై విరక్తితో కూడిన వినోదాత్మకంగా సాగే పాటను ఆలపించారు. ‘హతవిధి’ అనే పేరుతో సాగే ఈ పాటను మంగళవారం చిత్ర బృందం ఆవిష్కరించింది. మహేష్‌ బాబు.పి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాలో నవీన్‌ పొలిశెట్టి, అనుష్క నటించారు. నవీన్‌ పొలిశెట్టి నిస్సృహతో అరిచే సన్నివేశంతో ఈ పాట మొదలవుతుంది. హీరో తన భవిష్యత్తు తెలుసుకోవాలని ఒక చిలక జ్యోతిష్కుడి దగ్గరకు వెళితే అతని వద్ద ఉన్న చిలుక పారిపోతుంది. అలా తన జీవితంలో ఏది చేయాలనుకున్న అది అనుకున్నట్టు జరగపోవడం అనే కోణంలో పాట కొనసాగుతుంది. అంతే కాదు తనకు ఎదురవుతున్న సంఘటనల వల్ల హీరో ఎంత నిరుత్సాహానికి లోనవుతున్నాడో అన్న విషయాన్ని ఈ పాటలో స్పష్టంగా చూపించారు. దీనికి రామజోగయ్యశాస్త్రి సాహిత్యాన్నందించగా సంగీత దర్శకుడు రధన్‌ స్వరాలు సమకూర్చారు. ఈ పాటను విన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక లిరిక్స్‌ వద్ద తమ జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకోక మానరు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని