పేరు అదేనా?

బాలకృష్ణ పుట్టినరోజు జూన్‌ 10. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా పేరుని ఖరారు చేసి ప్రకటించేందుకు కసరత్తులు చేస్తోంది ఆ చిత్రబృందం.

Published : 01 Jun 2023 01:41 IST

బాలకృష్ణ పుట్టినరోజు జూన్‌ 10. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా పేరుని ఖరారు చేసి ప్రకటించేందుకు కసరత్తులు చేస్తోంది ఆ చిత్రబృందం. ‘భగవంత్‌ కేసరి’ అనే పేరు తాజాగా ప్రచారంలోకి వచ్చింది. ఇదివరకు  ఓ పేరు వినిపించినా...  ఇప్పుడు కొత్త పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. బాలకృష్ణకి జోడీగా కాజల్‌ నటిస్తున్నారు. శ్రీలీల ముఖ్యభూమిక పోషిస్తున్నారు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ  సందడి చేయనున్నారు బాలకృష్ణ. దసరా సందర్భంగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని