Tollywood: ‘జైలర్‌’ సంబరం

రజనీకాంత్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కిస్తోన్న ‘జైలర్‌’ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా గురువారం చిత్రబృందంతో కలిసి కేక్‌ కోసి ఆనందంగా గడిపారు రజనీ.

Updated : 02 Jun 2023 12:48 IST

జనీకాంత్‌ (Rajinikanth) కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కిస్తోన్న ‘జైలర్‌’ (Jailer) సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా గురువారం చిత్రబృందంతో కలిసి కేక్‌ కోసి ఆనందంగా గడిపారు రజనీ. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తోంది.


స్మగ్లింగ్‌కు సాక్ష్యం

రణ్‌ కుమార్‌ హీరోగా శివ కేశన కుర్తి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సాక్షి’. మునగాల సుధాకర్‌ రెడ్డి నిర్మాత. జాన్వీర్‌ కౌర్‌ కథానాయిక. నాగబాబు, ఆమని, ఇంద్రజ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను కృష్ణ జయంతి సందర్భంగా విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి.. ఇది గంజాయి స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే చిత్రమని అర్థమవుతోంది. యాక్షన్‌కు ఎంతో ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తోంది.


‘హింట్‌’ ఇచ్చిందెవరు?

యరామ్‌ తేజ కథానాయకుడిగా...  చందూ బిజుగ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హింట్‌’.  మైత్రి రెడ్డి, రిజ్వాన్‌ అహ్మద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘15 ఏళ్లుగా టెలివిజన్‌ పరిశ్రమలో దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం ఉంది. నిర్మాత మైత్రి రెడ్డి చెప్పిన కథ నచ్చి ఈ సినిమా చేస్తున్నా’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘థ్రిల్లింగ్‌ అంశాలతో కూడిన కథ ఇది. ఎవరికి ఎవరు హింట్‌ ఇచ్చారనేది ఈ కథలో ఆసక్తికరం. ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టుగా తెరకెక్కిస్తున్నాం. ధారావాహికల్లో జయరామ్‌ తేజ నటనని చూసి ఆయనకి కథానాయకుడిగా అవకాశం ఇచ్చాం. ఒకే షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణసాయి, ఎస్‌.వి.ఎన్‌.రావు తదితరులు పాల్గొన్నారు.


పైసా వసూల్‌.. ‘సిద్ధార్థ్‌ రాయ్‌’

‘ఆర్య’, ‘అతడు’, ‘లెజెండ్‌’ తదితర చిత్రాల్లో బాల నటుడిగా కనిపించి మెప్పించాడు దీపక్‌ సరోజ్‌. ఇప్పుడాయన ‘సిద్ధార్థ్‌ రాయ్‌’ సినిమాతో హీరోగా తెరకు పరిచయమవుతున్నారు. వి.యశస్వి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని జయ ఆడపాక, ప్రదీప్‌ పూడి, సుధాకర్‌ బోయిన నిర్మించారు. తన్వి నేగి కథానాయిక. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకులు శ్రీరామ్‌ ఆదిత్య, కార్తీక్‌ దండు, రచయిత లక్ష్మీ భూపాల తదితరులు ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దీపక్‌ మాట్లాడుతూ.. ‘‘ఆర్య’ సినిమాతో బాల నటుడిగా తెరకు పరిచయమై.. బాలకృష్ణ, ప్రభాస్‌, మహేష్‌బాబు లాంటి ఎంతో మంది గొప్పవారితో పని చేసే అవకాశం వచ్చింది. హీరోగా మంచి సినిమాలు చేయాలి, ప్రేక్షకుల మనసులు గెలవాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఈ కథ నా దగ్గరకు వచ్చింది. ఇది పైసా వసూల్‌ సినిమా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వంశీ, ప్రదీప్‌ పూడి, తన్వి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని