Srikanth Addala: ఓ సామాన్యుడి సంతకం

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి కుటుంబ కథా చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం ‘పెద కాపు - 1’.

Updated : 03 Jun 2023 12:40 IST

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి కుటుంబ కథా చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం ‘పెద కాపు - 1’. ఓ సామాన్యుడి సంతకం అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంతో విరాట్‌ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. ‘అఖండ’ లాంటి భారీ హిట్‌ చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని శుక్రవారం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.


‘ఫాస్ట్‌ఎక్స్‌ 2’కు  మేమిద్దరం సిద్ధం

డ్వేన్‌ జాన్సన్‌ ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 11’ సినిమాలో నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. చాలా కాలంగా విన్‌ డీసిల్‌తో ఉన్న విరోధం వల్ల ఆ చిత్రంలో నటించనని జాన్సన్‌ 2021లో తెలిపాడు. కానీ ఇప్పుడు డ్వేన్‌ జాన్సన్‌ ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ లోని హోబ్స్‌ పాత్రలో కనిపించనున్నట్లు ప్రకటించాడు. ఫాస్ట్‌ ఎక్స్‌: పార్ట్‌ 2గా ఈ చిత్రం రానుంది. ఈ సినిమా 2025లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ‘హోబ్స్‌ ఈజ్‌ బ్యాక్‌...మా ఇద్దరి మధ్య ఉన్న వైఖరిని పక్కకు పెట్టాము. మేమిద్దరం కలిసి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాము’ అంటూ జాన్సన్‌ ట్విటర్‌ ద్వారా ఒక వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. మే 19న విడుదలైన ‘ఫాస్ట్‌ ఎక్స్‌’ సినిమా విజయాన్ని కూడా ఆ వీడియో ద్వారా తెలిపాడు. ‘త్వరలో ఒక కొత్త ఛాప్టర్‌తో వచ్చే ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌లోని హోబ్స్‌ పాత్రను చూస్తారు’ అంటూ వ్యాఖ్యని జోడించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని