Ram: ముగింపు కాదు.. అంతకు మించి

కథానాయకుడు రామ్‌.. దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో ఓ పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Updated : 03 Jun 2023 12:26 IST

కథానాయకుడు రామ్‌ (Ram).. దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) కలయికలో ఓ పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. శ్రీలీల కథానాయిక. ఈ సినిమా తాజాగా ఓ కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని రామ్‌ ట్విటర్‌ వేదికగా తెలియజేశారు. ‘‘24రోజుల యాక్షన్‌ సన్నివేశాల్ని పూర్తి చేశాం. ఇది క్లైమాక్స్‌ కాదు.. అంతకు మించి’’ అంటూ రామ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడీ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి స్థాయి మాస్‌ యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. రామ్‌ సరికొత్త మాస్‌ లుక్‌తో కనిపించనున్నారు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా.. దసరా సందర్భంగా అక్టోబరు 20న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, కూర్పు: తమ్మిరాజు, ఛాయాగ్రహణం: సంతోష్‌ డిటాకే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని