హృదయ విదారకం

ఒడిశా రైలు ప్రమాద ఘటన సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరి హృదయాల్ని కలచివేసింది. ఈ మహా ప్రమాదంలో మరణించిన వారికి సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటంబాలకు అండగా ఉంటామని తెలిపారు పలువురు సినీ ప్రముఖులు.

Published : 04 Jun 2023 01:17 IST

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై స్పందించిన సినీ లోకం

ఒడిశా రైలు ప్రమాద ఘటన సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరి హృదయాల్ని కలచివేసింది. ఈ మహా ప్రమాదంలో మరణించిన వారికి సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటంబాలకు అండగా ఉంటామని తెలిపారు పలువురు సినీ ప్రముఖులు.

కస్మాత్తుగా జరిగిన ఈ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయంతో పాటు జీవిత కాల ఆదాయం అందే పాలసీలను అందించాలి. గాయపడిన వారికి కూడా ఆదుకోవాలి’

సోనూ సూద్‌

* ‘ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధగా ఉంది. దగ్గరి ప్రాంతాల్లో ఉన్న అభిమానులు గాయపడిన వారికి రక్తదానం చేయాలని కోరుకుంటున్నాను. వారిని కాపాడుకోవడం మన బాధ్యత’

చిరంజీవి

* ‘ఈ మహాప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుంటుంబ సభ్యులకు తోడుగా ఉంటాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నాను’

అల్లు అర్జున్‌

* ‘ఈ ఘోర రైలు ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకురాలని కోరుకుంటున్నాను’

యశ్‌

* ‘ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు బలం, ధైర్యం, మద్ధతు చేకూరాలని కోరుకుంటున్నాను’

ఎన్టీఆర్‌

* ‘మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, క్షేతగాత్రులైన కుటుంబాలకు మనోధైర్యం చేకూరాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను’

సల్మాన్‌ఖాన్‌

* ఈ దుర్ఘటనలో మరణించిన వారికి అక్షయ్‌ కుమార్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శిల్పాశెట్టి, కరీనా కపూర్‌, అలియా భట్‌, ఆర్‌.మాధవన్‌, సంజయ్‌ దత్‌,  అనుష్క శర్మ, రష్మిక, పరిణీతి చోప్రా తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు