Anupama Parameswaran: నా మెదడు సీసీ టీవీ ఫుటేజ్‌ లాంటిది

‘‘మనసును నొప్పించే విషయాన్నైనా.. బాధాకరమైన సంఘటననైనా వీలైనంత త్వరగా మర్చిపోయే ప్రయత్నం చేస్తుంటా’’ అంటోంది నటి అనుపమ పరమేశ్వరన్‌. భావోద్వేగాలు ప్రదర్శించే విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయని ప్రశ్నిస్తే..

Updated : 04 Jun 2023 08:29 IST

‘‘నసును నొప్పించే విషయాన్నైనా.. బాధాకరమైన సంఘటననైనా వీలైనంత త్వరగా మర్చిపోయే ప్రయత్నం చేస్తుంటా’’ అంటోంది నటి అనుపమ పరమేశ్వరన్‌. భావోద్వేగాలు ప్రదర్శించే విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయని ప్రశ్నిస్తే.. తనదైన శైలిలో ఇలా బదులిచ్చింది ఈ కేరళ కుట్టి. ‘‘భావోద్వేగాలు వ్యక్తపరిచే విషయంలో నేను చాలా పారదర్శకంగా ఉంటా. నాకేదైనా నచ్చలేదంటే అప్పటికప్పుడే ముఖం మీద చెప్పేస్తా. ఇక ఆ విషయాన్ని అక్కడే వదిలేస్తా. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. కొన్నాళ్లు ఉంటాం.. వెళ్లిపోతాం. ఆరోజు ఎప్పుడొస్తుందన్నది కూడా ఎవరికీ తెలియదు. కాబట్టి జీవించి ఉన్న ఈ కొన్ని రోజులు ఒత్తిడి దాచుకోవడానికి మన శక్తిని ఎందుకు అనవసరంగా ఖర్చు చేసుకోవాలి. సీసీ టీవీ పుటేజ్‌ నెల రోజుల తర్వాత ఆటోమెటిక్‌గా డిలీట్‌ అయినట్లు.. నా మెదడును ఉంచుకునే ప్రయత్నం చేస్తుంటా’’ అని చెప్పుకొచ్చింది అనుపమ. ఆమె ప్రస్తుతం తెలుగులో రవితేజతో ‘ఈగల్‌’, సిద్ధు జొన్నలగడ్డతో ‘టిల్లు స్క్వేర్‌’లో నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని