మనం మర్చిపోతున్న ‘మట్టికథ’

అజయ్‌ వేద్‌ హీరోగా పవన్‌ కడియాల తెరకెక్కించిన చిత్రం ‘మట్టికథ’. అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మించారు. ‘బలగం’ ఫేమ్‌ సుధాకర్‌ రెడ్డి, దయానంద్‌ రెడ్డి, కనకవ్వ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Published : 06 Jun 2023 01:19 IST

జయ్‌ వేద్‌ హీరోగా పవన్‌ కడియాల తెరకెక్కించిన చిత్రం ‘మట్టికథ’. అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మించారు. ‘బలగం’ ఫేమ్‌ సుధాకర్‌ రెడ్డి, దయానంద్‌ రెడ్డి, కనకవ్వ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్ర టైటిల్‌ నాకు బాగా నచ్చింది. మనం పుట్టేది.. గిట్టేది మట్టిలోనే. తెలంగాణ అంటే నాకు చాలా అభిమానం. ఇక్కడి ప్రజల మనసు స్వచ్ఛమైనది. ఈ చిత్రాన్ని అందరూ తప్పక చూడాలి’’ అన్నారు. ‘‘మనం మర్చిపోతున్న మట్టికథను అద్భుత కథా కథనాలతో ఈ చిత్రంలో చూపించాం. ఓ పల్లెటూరి కుర్రాడు తన కలలను నెరవేర్చుకోవడానికి ఎలాంటి తిప్పలు పడ్డాడు.. భూమితో తనకున్న అనుబంధం ఏంటి.. అన్నవి ఇందులో ఎంతో వాస్తవికంగా, కళాత్మకంగా చూపించాం’’ అన్నారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రానికి స్మరణ్‌ సాయి సంగీతమందించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని