పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బాలీవుడ్‌ నటి భూమి పెడ్నేకర్‌ 3000 మొక్కలు నాటింది. జూన్‌ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ప్రకటించిన ఐక్యరాజ్యసమితి.

Published : 06 Jun 2023 01:19 IST

3000 మొక్కలు నాటిన భూమి

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బాలీవుడ్‌ నటి భూమి పెడ్నేకర్‌ 3000 మొక్కలు నాటింది. జూన్‌ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ప్రకటించిన ఐక్యరాజ్యసమితి, 1973 నుంచి పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పిస్తూ ఎన్నో కార్యక్రమాలను చేపడుతోంది. అందులో భాగంగా భూమి మహారాష్ట్రలో 3000 మొక్కలను నాటుతూ పర్యావరణ పరిరక్షణపై అవగహన కల్పించింది. ఈ సందర్భంగా భూమి మాట్లాడుతూ...‘మానవాళి చేసే ఎన్నో పనుల వల్ల పర్యావరణం కాలుష్యం చెంది, ఎన్నో మార్పులు జరిగి ఈ ప్రపంచం ప్రమాదంలో ఉంది. ముఖ్యంగా చెట్లను నరికి వేయడం వల్ల ఈ గ్రహం చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇప్పుడు దానిని ఆపకపోతే మన భవిష్యత్తుపై మరింత ప్రమాదకరంగా ప్రభావం చూపుతుంది. ఈ ప్రమాదం జరగకుండా ఉండాలంటే సమయం కేటాయించుకొని ప్రతి ఒక్కరు చెట్లను నాటాలి’ అని అన్నారు. ‘చెట్లు మనకు ఆక్సిజన్‌ని ఇస్తాయి. అవే చెట్లు లేకపోతే మన పరిస్థితి ఏంటో ఆలోచించాలి. మనకోసం, మన తర్వాతి తరం కోసం పర్యావరణాన్ని కాపాడుకోవాలి. అది మన బాధ్యత. మీరందరూ దానికి కోసం సహకరిస్తారని ఆశిస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు పెడ్నేకర్‌. పర్యావరణానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తన వంతు కృషి చేస్తుంది భూమి. ఎప్పటికీ అలానే చేస్తానంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని