ఉస్తాద్‌ కోసం భారీ సెట్‌

‘గబ్బర్‌సింగ్‌’లాంటి భారీ హిట్‌ తర్వాత అగ్ర హీరో పవన్‌కల్యాణ్‌, దర్శకుడు హరీష్‌శంకర్‌ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’.

Published : 06 Jun 2023 01:20 IST

‘గబ్బర్‌సింగ్‌’లాంటి భారీ హిట్‌ తర్వాత అగ్ర హీరో పవన్‌కల్యాణ్‌, దర్శకుడు హరీష్‌శంకర్‌ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’. శ్రీలీల కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా కీలక షెడ్యూల్‌ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని సినీవర్గాలు సోమవారం తెలిపాయి. ఇందుకోసం ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌సాయి పర్యవేక్షణలో ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో కథానాయకుడు పవన్‌కల్యాణ్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొననుంది. ఇందులో పవన్‌ డైనమిక్‌ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అయనంక బోస్‌, దేవిశ్రీప్రసాద్‌ బాణీలు సమకూర్చుతున్నారు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని