కరణ్ జోహార్ 14 చిత్రాలతో బిజీ
దర్శకుడు, నిర్మాత, నటీనటులు, సంగీత దర్శకుడు.. ఎవరైనా నాలుగైదు చిత్రాలకు పని చేస్తేనే బిజీగా ఉంటారు.
దర్శకుడు, నిర్మాత, నటీనటులు, సంగీత దర్శకుడు.. ఎవరైనా నాలుగైదు చిత్రాలకు పని చేస్తేనే బిజీగా ఉంటారు. అలాంటిది దర్శకనిర్మాత కరణ్ జోహార్ చేతిలో ఏకంగా 14 సినిమాలున్నాయి. అందులో ఏడు రాబోయే ఏడాది వ్యవధిలో విడుదలకు సిద్ధమవుతుండగా.. మరో ఏడు ప్రి ప్రొడక్షన్ స్థాయిలో ఉన్నాయి. 1998లో విడుదలైన ‘కుచ్ కుచ్ హోతా హై’ నుంచి జులైలో విడుదలకు సిద్ధంగా ఉన్న ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ వరకు ఎన్నో హిట్లు అందించారాయన. సొంత బ్యానర్ ధర్మా ప్రొడక్షన్ ద్వారా పలు చిత్రాలూ నిర్మించారు. ప్రస్తుతం అలియాభట్, రణ్‌వీర్‌సింగ్‌ల ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’.. విక్కీ కౌశల్, త్రిప్తి దిమ్రీ కలిసి నటిస్తున్న ‘మేరే మెహబూబ్ మేరే సనమ్’.. సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా పటానీ, రాశీ ఖన్నా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న ‘యోధా’.. అక్షయ్ కుమార్ హీరోగా.. ప్రఖ్యాత న్యాయవాది సి.శంకరన్ నాయర్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఓ చిత్రం, సారా అలీఖాన్‌తో ‘యే వతన్ మేరే వతన్’.. కాజోల్, పృథ్వీరాజ్, ఇబ్రహీం అలీఖాన్ కలయికలో ‘సార్జామీన్’.. జాన్వీ కపూర్, రాజ్‌కుమార్‌రావులు జోడీగా ‘మిస్టర్ ఔర్ మిసెస్ మహీ’ చిత్రాలకు దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు కరణ్ జోహార్. ఈ సినిమాలు రాబోయే 12 నెలల వ్యవధిలో విడుదలవుతుండగా.. మరో ఏడు చిత్రాలు పూర్వ నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉన్నాయని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Akhil: కోలీవుడ్ దర్శకుడితో అఖిల్ సినిమా..?
-
Vande Bharat: 9 వందే భారత్ రైళ్లు ప్రారంభం.. కాచిగూడ-యశ్వంత్‌పుర్, విజయవాడ-చెన్నై మధ్య పరుగులు
-
Purandeswari: ఆర్థిక పరిస్థితిపై బుగ్గన చెప్పినవన్నీ అబద్ధాలే: పురందేశ్వరి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Nara Brahmani: నారా బ్రాహ్మణితో సమావేశమైన జనసేన నేతలు
-
Sanju Samson: సంజూ శాంసన్ ఆ వైఖరిని మార్చుకోవాలి: శ్రీశాంత్