ఆ గ్రామంలో ఏం జరిగింది?

పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టే చిత్రమంటే ప్రేక్షకులకు సహజంగానే ఆసక్తి. అలాంటి ఓ మారుమూల గ్రామంలో జరిగిన ఒక సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే.. ఎవరికైనా తెలుసుకోవాలనే ఉత్సుకత ఉంటుంది.

Published : 07 Jun 2023 01:47 IST

పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టే చిత్రమంటే ప్రేక్షకులకు సహజంగానే ఆసక్తి. అలాంటి ఓ మారుమూల గ్రామంలో జరిగిన ఒక సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే.. ఎవరికైనా తెలుసుకోవాలనే ఉత్సుకత ఉంటుంది. ఆ తరహా చిత్రమే మా ‘భీమదేవరపల్లి బ్రాంచి’ అంటున్నారు దర్శకుడు రమేష్‌ చెప్పాల. బత్తిని కీర్తిలతా గౌడ్‌, రాజా నరేందర్‌ చెట్లపల్లి నిర్మిస్తున్నారు. ‘వాస్తవిక సంఘటనల ఆధారంగా, ఊహకందని మలుపులతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం. ప్రివ్యూ చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుందని ప్రశంసించారు’ అన్నారు దర్శకనిర్మాతలు. అంజి వల్గమాన్‌, సాయిప్రసన్న, ‘బలగం’ ఫేం సుధాకర్‌ రెడ్డి, రాజవ్వ, కీర్తిలత ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని జూన్‌ 23న మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్‌ విడుదల చేయనుంది. సంగీతం: చరణ్‌అర్జున్‌, సాహిత్యం: సుద్దాల అశోక్‌ తేజ, సంజయ్‌ మహేష్‌ వర్మ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు