స్వరప్రయాణం మొదలైంది

నితిన్‌ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. రష్మిక మందన్న కథానాయిక.

Published : 07 Jun 2023 01:47 IST

నితిన్‌ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. రష్మిక మందన్న కథానాయిక. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమా సంగీత చర్చలు ప్రారంభమైనట్టు మంగళవారం సినీవర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. దీనికి జి.వి.ప్రకాష్‌కుమార్‌ స్వరకర్త. కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందిస్తున్నారు. ‘‘ప్రేక్షకులకు ఓ పండగలాంటి ఆనందాన్నిచ్చే కలయిక ఇది. నితిన్‌ స్టైలిష్‌ అవతారంలో కనిపించనుండగా.. రష్మిక మోడ్రన్‌ లుక్‌లో సందడి చేయనున్నారు. రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిశోర్‌ తదితర నటులతోపాటు.. అగ్ర శ్రేణి సాంకేతిక నిపుణులు ఈ సినిమాకోసం పనిచేస్తున్నార’’ని సినీవర్గాలు తెలిపాయి. ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్‌, కళ: రామ్‌కుమార్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని