అప్పుడే ఫలితాలు దక్కుతాయి!
‘‘పనిలో ఆనందాన్ని వెతుక్కున్నప్పుడు ఆ పని చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. అలాగని దాన్నే వ్యక్తిగత జీవితంలోకి తెచ్చేసుకోకూడదు.
‘‘పనిలో ఆనందాన్ని వెతుక్కున్నప్పుడు ఆ పని చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. అలాగని దాన్నే వ్యక్తిగత జీవితంలోకి తెచ్చేసుకోకూడదు. వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని వేరు వేరుగా చూసినప్పుడే మానసిక ప్రశాంతత దొరుకుతుంది’’ అంటోంది నటి సాయిపల్లవి. ‘‘నేనే చిత్రం చేసినా సరే.. సాయంత్రం షూట్ ముగించుకోని బయటకొచ్చానంటే దాని గురించి మళ్లీ ఏమాత్రం ఆలోచించను. అదే తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టానంటే మాత్రం నా నిజ జీవితాన్ని పూర్తిగా మర్చిపోతా. సెట్స్‌లో ఉన్నంతసేపూ ఆ సినిమాలోని పాత్రగానే జీవిస్తుంటా. ఏ విషయంలోనైనా ఆ సమయానికి తగ్గట్లుగా దేనికి ఇచ్చే ప్రాధాన్యత దానికి ఇవ్వగలిగినప్పుడే పనిపై పూర్తి ఏకాగ్రతను ప్రదర్శించగలుగుతాం. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ అత్యుత్తమ ఫలితాలు అందుకోగలుగుతాం’’ అని చెప్పుకొచ్చింది సాయిపల్లవి. గతేడాది ‘విరాటపర్వం’, ‘గార్గి’ చిత్రాలతో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆమె.. ఇప్పుడు తమిళంలో శివ కార్తికేయన్‌తో ఓ చిత్రంలో నటిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rathod Bapu Rao: భారాసకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా: రాథోడ్ బాపూరావు
-
Lokesh: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దౌర్జన్యం.. నిలదీస్తే నిర్బంధం..: లోకేశ్
-
Sri Lanka: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్టయిన శ్రీలంక మాజీ క్రికెటర్‌కు బెయిల్
-
పిల్లలతో కలిసి మా సినిమా చూడొద్దు: స్టార్ హీరో
-
Vishnu Manchu: ‘కన్నప్ప’ కోసం 600 మంది త్యాగం చేశారు: డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంచు విష్ణు పోస్ట్
-
Imran Khan: మరో జైలుకు ఇమ్రాన్ ఖాన్.. ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశం