Tamanna: స్నేహితుల మధ్య ప్రేమ మొదలైతే..

‘మేం ఏడుగురం చిన్ననాటి నుంచీ స్నేహితులం. మమ్మల్ని ఎవరూ విడదీయలేనంత దోస్తులం. కానీ మా మధ్యే ప్రేమ మొదలైతే...?’ అని మొదలవుతోంది ‘జీ కర్దా’ ట్రైలర్‌.

Updated : 07 Jun 2023 11:25 IST

‘మేం ఏడుగురం చిన్ననాటి నుంచీ స్నేహితులం. మమ్మల్ని ఎవరూ విడదీయలేనంత దోస్తులం. కానీ మా మధ్యే ప్రేమ మొదలైతే...?’ అని మొదలవుతోంది ‘జీ కర్దా’ ట్రైలర్‌. తమన్నా భాటియా, సుహైల్‌ నయ్యర్‌ జోడీగా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. అరుణిమా శర్మ దర్శకురాలు. ఆ ఏడుగురిలో ఐటీ ఉద్యోగులైన ఇద్దరు ప్రేమలో పడి, పెళ్లి చేసుకోవాలనుకుంటారు. వాళ్ల వివాహంలో సందడి చేయడానికి చిన్ననాటి స్నేహితులు తరలి వస్తారు. తర్వాత జరిగే పరిణామాలే ఈ సిరీస్‌. వినోదం, డ్రామా, భావోద్వేగాల కలబోతే ఈ షో అంటున్నారు నిర్మాత దినేష్‌ విజన్‌. జూన్‌ 15 నుంచి ఈ వెబ్‌ షో అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం కానుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని