కూతురు కోసం తండ్రి పోరాటం
దేవాశీష్ మాఖీజ దర్శకత్వంలో మనోజ్ బాజ్‌పేయి, జీషన్ అయ్యూబ్ కలిసి నటించిన చిత్రం ‘జోరమ్’.
దేవాశీష్ మాఖీజ దర్శకత్వంలో మనోజ్ బాజ్‌పేయి, జీషన్ అయ్యూబ్ కలిసి నటించిన చిత్రం ‘జోరమ్’. జీ స్టూడియోస్, దేవాశీస్ సొంత నిర్మాణ సంస్థ అయిన మాఖీజఫిల్మ్, నిర్మాత అనుపమ బోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా 52వ రొటేర్‌డమ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గొప్ప ప్రశంసలను అందుకుంది. తాజాగా ఈ సినిమా డర్బన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అధికారికంగా ఎంపికైంది. జీ స్టూడియో సీబీవో షరీఖ్ పటేల్ మాట్లాడుతూ..‘ఈ సంస్థ ద్వారా వచ్చిన సినిమా అధికారికంగా ఎంపికవడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. ‘జోరమ్ ఎన్నో భావోద్వేగాలను కలగలిపిన థ్రిల్లర్ సినిమా. ఒక సామాన్యుడి చావు కోరుకుంటూ కొందరు తనను వెంబడిస్తారు. తన కూతుర్ని కాపాడుకోవాడానికి తండ్రి ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? తన కూతురిని ఎలా రక్షించుకుంటాడనేదే సినిమా. తండ్రిగా మనోజ్ బాజ్‌పేయి నటన మనసుకు హత్తుకుంది. మా సినిమాకి అంతర్జాతీయంగా గుర్తింపు దక్కడం ఎంతో సంతోషం. ఆ పోటీలో పాల్గొనడానికి ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాము’ అని చిత్ర దర్శకుడు దేవాశీష్ తెలిపారు. మనోజ్ బాజ్‌పేయి మాట్లాడుతూ..‘ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. దేవాశీష్, జీ స్టూడియోస్ కలయికలో వచ్చిన గొప్ప సినిమా అని చెప్పవచ్చు. డర్బన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు మా సినిమా ఎంపికైనందుకు చాలా గర్వంగా ఉంది’ అన్నారు. ఈచిత్రం వచ్చే వారం సిడ్నీ చిత్రోత్సవాలకు వెళ్లనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vivek Agnihotri: నా సినిమాకు వ్యతిరేకంగా డబ్బులు పంచుతున్నారు: వివేక్ అగ్నిహోత్రి తీవ్ర ఆరోపణలు
-
Russia: పశ్చిమ దేశాలు నేరుగా రష్యాతో యుద్ధంలో ఉన్నాయి: సెర్గీ లవ్రోవ్
-
Motkupalli: జగన్.. నీ విధానాలు చూసి జనం నవ్వుకుంటున్నారు: మోత్కుపల్లి
-
Nara Lokesh: వచ్చేవారం నారా లోకేశ్ ‘యువగళం’ తిరిగి ప్రారంభం..!
-
Yanamala: ప్రభుత్వానివి చందమామ కథలు.. సీఐడీవి చిలకపలుకులు: యనమల
-
UPPAL Stadium: ఆటతో అదిరేలా.. ఉప్పల్ ఊగేలా!