Adipurush: ఉచితంగా 10 వేల టికెట్లు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు...  అనాథ శరణాలయాలు...  వృద్ధాశ్రమాలకి పదివేలకిపైగా టికెట్లు ఉచితంగా  ఇవ్వనున్నట్టు నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ తెలిపారు.

Updated : 08 Jun 2023 10:34 IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు...  అనాథ శరణాలయాలు...  వృద్ధాశ్రమాలకి పదివేలకిపైగా టికెట్లు ఉచితంగా  ఇవ్వనున్నట్టు నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ తెలిపారు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సామాజిక మాధ్యమాల్లో ఇచ్చిన లింక్‌లో  గూగుల్‌ పారమ్‌ని పూర్తి చేసి పంపించాల్సి ఉంటుందని  ఓ ప్రకటనలో తెలిపాయి. సందేహాల నివృత్తి కోసం  ఫోన్‌ నెం: 95050 34567 నంబర్‌ని కేటాయించింది. ‘‘శ్రీరాముడి ప్రతి అధ్యాయం మానవాళికి ఓ పాఠం. ఈ తరం ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన దివ్య అడుగు జాడల్ని అనుసరించాలి’’ అంటూ ఆ ప్రకటనలో చిత్రబృందం పేర్కొంది.

అది అబద్ధం

‘ఆదిపురుష్‌’ ప్రదర్శితమయ్యే థియేటర్లలోకి దళితులకి  ప్రవేశం లేదంటూ చిత్రబృందం విడుదల చేసినట్టున్న ఓ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. దీనిపై చిత్రబృందం స్పందించింది. ఆ ప్రకటన అబద్ధం అని  స్పష్టం చేసింది. ‘‘కులం, వర్ణం, మతం ఆధారంగా ఎలాంటి వివక్షతని చూపకుండా సమానత్వం కోసమే ‘ఆదిపురుష్‌’ బృందం దృఢంగా నిలుస్తుంది. ఇలాంటి చెడు ప్రచారాల్ని ఎదుర్కోవడంలో మాకు సహాయ సహకారాలు అందించండ’’ని ట్విటర్‌ ద్వారా కోరాయి చిత్ర వర్గాలు. ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘ఆదిపురుష్‌’ ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని