రాత్రి 7 గంటల 11 నిమిషాలకు హంసలదీవిలో
సాహస్, దీపికా నటించిన చిత్రం ‘7:11 పీఎమ్’. చైతు మాదాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మాతలు.
సాహస్, దీపికా నటించిన చిత్రం ‘7:11 పీఎమ్’. చైతు మాదాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మాతలు. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని ఆవిష్కరించారు. ఆ టీజర్‌తో సినిమాలోని ప్రధాన పాత్రలు, కథా నేపథ్యం పరిచయమయ్యాయి. ‘‘భవిష్యత్తుని ఆవిష్కరించే ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రమిది. మానవుల మనుగడకి కీలకమైన సమాచారం కోసం హంసలదీవి అనే ఓ ఊరికి వెళుతుంది హీరో బృందం. అదే రోజున ఆ ఊరిని నాశనం చేయడం కోసం కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి. కథానాయకుడు తనకి నిర్దేశించిన 7:11 పీఎమ్ సమయంలోపే ఓ మిస్టరీని ఛేదించాల్సి ఉంటుంది. లేదంటే అతని గుండె ఆగిపోతుంది. ఆ పరిస్థితుల్లో అతను ఏం చేశాడనేది తెరపైనే చూడాలి. సీట్ అంచున కూర్చోబెట్టి థ్రిల్‌ని పంచే చిత్రమిది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామ’’ని సినీ వర్గాలు చెప్పాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
LuLu Mall - Hyderabad: లులు మాల్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
Stock Market: లాభాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు.. 19,700 ఎగువకు నిఫ్టీ
-
PM Modi: ప్రధానికి ఛాయ్ ఇచ్చిన రోబో.. ఫొటో మిస్ అవ్వొద్దన్న మోదీ
-
RuPay Credit card: యూపీఐ ఎఫెక్ట్.. రూపే కార్డులకు భలే డిమాండ్..!
-
ODI WC: వరల్డ్ కప్‌ను జట్టుగానే గెలుస్తారు.. ఏ ఒక్కరి వల్లనో కాదు: ఏబీ డివిలియర్స్
-
Chandrababu: చంద్రబాబు ఎస్ఎల్పీపై సుప్రీంలో విచారణ వాయిదా