గాంఢీవధారి రాకకు వేళాయే!
యువ కథానాయకుడు వరుణ్‌తేజ్ రెండు సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. అందులో ఒకటి... ‘గాంఢీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు.
యువ కథానాయకుడు వరుణ్‌తేజ్ రెండు సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. అందులో ఒకటి... ‘గాంఢీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. చివరి దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఆగస్టు 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్రబృందం బుధవారం ప్రకటించింది. ‘‘వరుణ్‌తేజ్ కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో రూపొందుతున్న చిత్రమిది. గాఢతతో కూడిన ఓ బలమైన పాత్రలో ఆయన కనిపిస్తారు. ప్రస్తుతం విదేశాల్లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకి యాక్షన్ ఘట్టాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అత్యున్నత సాంకేతిక విలువలతో ప్రవీణ్ సత్తారు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నార’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ఛాయాగ్రహణం: ముఖేష్, కళ: అవినాష్ కొల్లా.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Raveena Tandon: అతడి పెదవులు తాకగానే వాంతి అయింది: రవీనా టాండన్
-
Vijay Deverakonda-Rashmika: విజయ్ దేవరకొండ.. నువ్వు ఎప్పటికీ ది బెస్ట్: రష్మిక
-
Yuvagalam: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వాయిదా
-
MS Swaminathan: దేశ ‘వ్యవసాయం తలరాత’నే మార్చి.. 84 డాక్టరేట్లు పొంది!
-
AIADMK: మళ్లీ ఎన్డీయేలో చేరం.. అన్నామలైని తొలగించాలని మేం కోరం: అన్నాడీఎంకే
-
USA: అమెరికా పిల్లలకి ‘లెక్కలు’ రావడం లేదట..!