ఖుషీ ఖుషీగా...

కుంభస్థలంపై గురి పెట్టినట్టు కనిపిస్తోంది కథానాయిక సమంత. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపే లక్ష్యంగా ఆమె  ప్రయాణం సాగుతోంది.

Published : 08 Jun 2023 02:02 IST

కుంభస్థలంపై గురి పెట్టినట్టు కనిపిస్తోంది కథానాయిక సమంత. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపే లక్ష్యంగా ఆమె  ప్రయాణం సాగుతోంది. దక్షిణాది కథానాయికగానే గుర్తింపున్న సమంత, ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’తో తన స్థాయిని పెంచుకొంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేయడమే లక్ష్యంగా ఆమె కెరీర్‌ పరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రస్తుతం ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్న సమంత... . ‘సిటాడెల్‌’ వెబ్‌ సిరీస్‌తోనూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తదుపరి మరో సిరీస్‌లోనూ నటించేందుకు సిద్ధమవుతోంది. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే సమంత... ‘ఖుషి’ చిత్రీకరణలో భాగంగా టర్కీలో గడిపిన ఈ రోజులు అంటూ ఇన్‌స్టాలో కొన్ని ఫొటోల్ని పంచుకుంది. ఫిట్‌నెస్‌ విషయంలో చురుగ్గా ఉండే ఆమె... మునుపటిలా కసరత్తులు చేస్తూ, అప్పటి అందంతో కట్టిపడేసే ప్రయత్నం చేస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు