నయన చిత్రం.. ప్రతీకార నేపథ్యం

ఓ పక్క కమర్షియల్‌ చిత్రాలు..మరో పక్క నాయికా ప్రాధాన్య చిత్రాలు చేస్తూ కెరీర్‌ను పరుగులు పెట్టిస్తోంది కథానాయిక నయనతార. ఇప్పుడు ఆమె నుంచి రాబోతున్న ప్రతీకార నేపథ్య చిత్రం ‘ఇరైవన్‌’.

Published : 09 Jun 2023 06:04 IST

ఓ పక్క కమర్షియల్‌ చిత్రాలు..మరో పక్క నాయికా ప్రాధాన్య చిత్రాలు చేస్తూ కెరీర్‌ను పరుగులు పెట్టిస్తోంది కథానాయిక నయనతార. ఇప్పుడు ఆమె నుంచి రాబోతున్న ప్రతీకార నేపథ్య చిత్రం ‘ఇరైవన్‌’. ఇందులో జయం రవి కథానాయకుడు. ఆయన ఇందులో పోలీసు పాత్రలో కనిపించనున్నారు. 2015లో వచ్చిన ‘తని ఒరువన్‌’ తర్వాత వీరిద్దరి కలయికలో రానున్న సినిమా ఇది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ‘ఇరైవన్‌’ ఆగస్టు 25న తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తూ హీరో రవి ఒక పోస్టరును ట్విటర్‌లో పంచుకున్నారు. అందులో రక్తంతో తడిసిన ఒక కత్తితో పాటు నయనతార, రవి కనిపిస్తారు. ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా స్వరాలందించారు. ఈ సినిమా తర్వాత షారుక్‌ ఖాన్‌తో కలిసి ‘జవాన్‌’ చిత్రంలో నయనతార కనిపించనుంది. అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఆ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టనుంది. ఆమె ప్రధాన పాత్రలో నీలేష్‌ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ‘లేడీ సూపర్‌స్టార్‌ 75’(వర్కింగ్‌ టైటిల్‌) షూటింగ్‌ ఇటీవలే మొదలైంది. వీటితో పాటు కమల్‌ హాసన్‌కు జోడీగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో నటించనున్నట్లు సమాచారం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని