Pathaan: రష్యాలో 3వేల థియేటర్లలో ‘పఠాన్’
భాషతో సంబంధం లేకుండా పలు చిత్రాలు బాక్సాఫీసు వద్ద వసూళ్లు కురిపిస్తుంటాయి. ఈ మధ్య కాలంలో అలాంటి చిత్రాలు చాలానే వచ్చాయి.
భాషతో సంబంధం లేకుండా పలు చిత్రాలు బాక్సాఫీసు వద్ద వసూళ్లు కురిపిస్తుంటాయి. ఈ మధ్య కాలంలో అలాంటి చిత్రాలు చాలానే వచ్చాయి. పాన్ ఇండియా స్థాయిలో అలరించి విదేశీ ప్రేక్షకుల్ని సైతం మెప్పించాయి. ఈ మధ్య విడుదలైన ‘పఠాన్’ (Pathaan) చిత్రం దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించింది. బాలీవుడ్‌కు కొత్త ఊపిరినిచ్చింది. షారుక్‌ఖాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని రష్యా, కామన్ వెల్త్ ఇండిపెండెంట్ స్టేట్స్(సీఐఎస్)లో జూన్ 13న 3వేలకు పైగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. దీపికా పదుకొణె, జాన్ అబ్రహం కీలక పాత్రల్లో నటించిన ‘పఠాన్’కు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా బంగ్లాదేశ్‌లోని 41 థియేటర్లలో విడుదలై మొదటిరోజే రూ.25లక్షల వసూళ్లు చేసింది. 1971 తర్వాత అక్కడ విడుదలైన మొదటి హిందీ సినిమా ‘పఠాన్’.
‘మాయా పేటిక’ తెరవడానికి సిద్ధం
విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్ ప్రధాన పాత్రల్లో రమేష్ రాపర్తి తెరకెక్కించిన చిత్రం ‘మాయా పేటిక’. మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి నిర్మించారు. సునీల్, పృథ్వీరాజ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని నటి కీర్తి సురేష్ ద్వారా తెలియపరిచింది చిత్ర బృందం. ఈ సందర్భంగా దర్శకుడు రమేష్ మాట్లాడుతూ.. ‘‘ఓ సెల్‌ఫోన్ కథ ఆధారంగా రూపొందించిన చిత్రమిది. మంచి కామెడీ, పాటలు, చక్కటి విజువల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు. ‘‘రొటీన్‌కు భిన్నంగా ఉండే చిత్రమిది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమా అందరినీ అలరిస్తుంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: గుణ బాలసుబ్రమణియన్, ఛాయాగ్రహణం: సురేష్ రగుతు.
ఆ పుస్తకంలో ఏముంది?
కాజల్, రెజీనా, జనని అయ్యర్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘కార్తీక’. డి.కార్తికేయన్ (డీకే) దర్శకత్వం వహించారు. తమిళంలో ‘కరుంగాపియం’ పేరుతో రూపొందిన ఈ సినిమాని, వెంకటసాయి ఫిలింస్ పతాకంపై టి.జనార్ధన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ముత్యాల రాందాస్ సమర్పకులు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ‘‘హారర్, సస్పెన్స్ అంశాలతో కూడిన థ్రిల్లర్ కథ ఇది. వందేళ్లనాటి పుస్తకం ఈ చిత్రంలో కీలకం. ఇంతకీ ఆ పుస్తకం ప్రత్యేకత ఏమిటి? అందులో ఏముంది? అది చదివాక చోటు చేసుకున్న పరిణామాలు ఎలాంటివన్నది తెరపైనే చూడాలి. తనకి హాని కలిగించిన వ్యక్తులపై దెయ్యంలా మారి పగ తీర్చుకునే పాత్రలో కాజల్ కనిపిస్తుంది. దర్శకుడు కార్తికేయన్ తనదైన శైలిలో చిత్రాన్ని తీర్చిదిద్దారు. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి’’ అన్నారు. రైజా విల్సన్, నోయిరికా తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రసాద్.ఎస్.ఎన్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
Balakrishna: 2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్‌రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్‌ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్‌గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు