నవ్వించాలని చేసిన సినిమా ‘అన్‌ స్టాపబుల్‌’

వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా డైమండ్‌ రత్నబాబు తెరకెక్కించిన చిత్రం ‘అన్‌ స్టాపబుల్‌’. రజిత్‌ రావు నిర్మాత. నక్షత్ర, అక్సాఖాన్‌ కథానాయికలు.

Published : 11 Jun 2023 01:38 IST

వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా డైమండ్‌ రత్నబాబు తెరకెక్కించిన చిత్రం ‘అన్‌ స్టాపబుల్‌’. రజిత్‌ రావు నిర్మాత. నక్షత్ర, అక్సాఖాన్‌ కథానాయికలు. ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌లో శనివారం సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో సన్నీ మాట్లాడుతూ.. ‘‘సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుందని.. హాయిగా నవ్వుకున్నామని చెబుతున్నారు. దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఇలాంటి మంచి చిత్రాల్ని మరింత ప్రోత్సహించాలి’’ అన్నారు. ‘‘మాకు ప్రేక్షక దేవుళ్లు ఇచ్చిన తీర్పు రియల్‌ బ్లాక్‌ బస్టర్‌. ఇకపై అన్నీ నవ్వించే సినిమాలే చేస్తాను. అందరినీ నవ్వించాలనే ఉద్దేశంతో చేసిన చిత్రమిది. తప్పకుండా థియేటర్లలో చూడండి’’ అన్నారు దర్శకుడు డైమండ్‌ రత్నబాబు. ఈ కార్యక్రమంలో అక్సాఖాన్‌, రజిత్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని