Vimanam: నాన్న గొప్పతనం చెప్పే చిత్రమిది

సముద్రఖని, అనసూయ ప్రధాన పాత్రల్లో శివ ప్రసాద్‌ యానాల తెరకెక్కించిన చిత్రం ‘విమానం’. జీ స్టూడియోస్‌తో కలిసి కిరణ్‌ కొర్రపాటి నిర్మించారు.

Updated : 11 Jun 2023 09:06 IST

ముద్రఖని, అనసూయ ప్రధాన పాత్రల్లో శివ ప్రసాద్‌ యానాల తెరకెక్కించిన చిత్రం ‘విమానం’. జీ స్టూడియోస్‌తో కలిసి కిరణ్‌ కొర్రపాటి నిర్మించారు. ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో శనివారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సముద్రఖని మాట్లాడుతూ.. ‘‘ఓ మంచి కథ చెప్తే ప్రేక్షకులు కచ్చితంగా దాన్ని భుజానికెత్తుకుంటారు. అది ‘విమానం’తో మరోసారి నిరూపించారు. మళ్లీ జులై 28న ‘బ్రో’తో థియేటర్లో కలుద్దాం’’ అన్నారు. ‘‘నిజంగానే నాన్న మన జీవితాల్లో ఓ గొప్ప హీరో. ఈ కథ విన్నప్పుడు నాకు ‘మాతృదేవోభవ’ గుర్తొచ్చింది. ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు గర్వంగా అనిపించింది’’ అంది నటి అనసూయ. దర్శకుడు శివ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘సినిమా చాలా బాగుందని అందరూ ఫోన్‌ చేస్తుంటే ఓ కిక్‌ వచ్చినట్లుంది. నాన్నే గొప్ప హీరో అని చెప్పే చిత్రమిది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ధనరాజ్‌, చరణ్‌ అర్జున్‌, ధ్రువన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని