The Vaccine War: తుది దశకు వ్యాక్సిన్‌ వార్‌

వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ వివాదాల మధ్య విడుదలైనా, బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లతో విజయాన్ని సొంతం చేసుకుంది.

Updated : 11 Jun 2023 09:05 IST

వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ వివాదాల మధ్య విడుదలైనా, బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ దర్శకుడు నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న మరో చిత్రం ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉన్నట్లు వివేక్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. నానా పటేకర్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వివేక్‌ రంజన్‌ గతేడాదే ఈ సినిమా గురించి ప్రకటిస్తూ, ఈ సినిమా పట్ల తన ఆసక్తిని కనబరిచారు. ‘నీకు తెలియని దానితో యుద్ధం చేసి నువ్వు గెలిచావు’ అనే ట్యాగ్‌లైన్‌తో సినిమా మొదటి లుక్‌ని విడుదల చేసి సినిమా పట్ల అంచనాలను పెంచింది చిత్రబృందం. ఈ సినిమా గురించి ఎక్కువ సమాచారం వెల్లడించనప్పటికి సినిమా టైటిల్‌తో, మొదటి పోస్టర్‌లో ఉన్న ట్యాగ్‌లైన్‌తో ఇదొక సైన్స్‌ ఫిక్షన్‌తో కూడిన సినిమా అనుకొవచ్చు. కరోనా సమయంలో వైద్యులు, పరిశోధకులు చేసిన గొప్ప సేవలకు ఈ సినిమా నివాళులర్పించనుంది. హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, పంజాబీ, కన్నడ, తమిళ, తెలుగు, మలయాళం, గుజరాతీ, మరాఠీ భాషల్లో దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని