సంక్రాంతికి గ్రహాంతర విందు

ప్రముఖ కథానాయకుడు శివకార్తికేయన్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘అయలాన్‌’... ‘డెస్టినేషన్‌ ఎర్త్‌’ అనేది ఉపశీర్షిక.  

Published : 24 Sep 2023 04:41 IST

ప్రముఖ కథానాయకుడు శివకార్తికేయన్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘అయలాన్‌’... ‘డెస్టినేషన్‌ ఎర్త్‌’ అనేది ఉపశీర్షిక.  సైన్స్‌ ఫిక్షన్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను ఆర్‌.రవికుమార్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ఆలస్యంగా వసున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు అదే విషయాన్ని చిత్రబృందం సామాజిక మాధ్యమాల ద్వారా ఒక ఫొటోను అభిమానులతో పంచుకుంటూ అధికారికంగా ప్రకటించింది. ‘ఈ సంక్రాంతికి గ్రహాంతర విందు ఉండబోతోంది. సినిమా నాణ్యతను మెరుగుపరుస్తూ, ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించాలన్న లక్ష్యంతో మా ‘అయలాన్‌’ మీ ముందుకు రానుందని ఆశిస్తున్నాము. మీరు దీని కోసం చాలా కాలం వేచి ఉన్నారు. మేము అడగగలిగేది మరికొన్ని నెలలు మాత్రమే. మీ ప్రేమకు కృతజ్ఞతగా మేము ‘అయలాన్‌’ టీజర్‌ను అక్టోబరు మొదటివారంలో అందిస్తాము’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. 24ఏఎం స్టూడియోస్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని