Vijay Deverakonda: ధర్మానికే కొత్త దర్వాజా వీడు

‘ఫ్యామిలీస్టార్‌’గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు విజయ్‌ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ సినిమాని పరశురామ్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘

Updated : 05 Mar 2024 06:57 IST

‘ఫ్యామిలీస్టార్‌’గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు విజయ్‌ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ సినిమాని పరశురామ్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘గీత గోవిందం’ తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో చిత్రమిది. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. ఈ సినిమా ఏప్రిల్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వంలో భాగంగా సోమవారం ఈ చిత్ర టీజర్‌ బయటకొదిలారు. ‘‘కలియుగ రాముడు అచ్చిండు కాకో.. ఫ్యామిలీ విషయంలో వీడు కొంచెం వీకో.. ధర్మానికే కొత్త దర్వాజారా వీడు.. వీడి వాళ్ల జోలికే రాకుండా దాక్కో.. మడతపెట్టి కొడితే ముడుసులు బ్రేకో.. తెలుసుకో’’ అంటూ ఓ పాట రూపంలో టీజర్‌లో విజయ్‌ పాత్రను.. అతని నేపథ్యాన్ని ఆసక్తికరంగా పరిచయం చేశారు.  ఆఖర్లో ‘‘నేను కాలేజీకి వెళ్లాలి.. కొంచెం దించేస్తారా’’ అంటూ మృణాల్‌ అడగ్గా.. ‘‘ఓ లీటర్‌ పెట్రోల్‌ కొట్టిస్తే దించేస్తా’’ అంటూ విజయ్‌ బదులివ్వడం నవ్వులు పూయించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని