ఈటీవీ విన్‌లో నేడే రష్‌

‘రష్‌’...ఓ రిటైర్డ్‌ పోలీసు అధికారిణి తన కుటుంబాన్ని రక్షించేందుకు చేసిన పోరాటాన్ని చూపించిన క్రైమ్‌ డ్రామా చిత్రం. నటుడు రవి బాబు ప్రధాన పాత్రలో నటిస్తూ..నిర్మించారు. డైసీ బొప్పన్న, కార్తిక్‌ ఆకృతి కీలక పాత్రలు పోషించారు.

Published : 13 Jun 2024 00:39 IST

‘రష్‌’...ఓ రిటైర్డ్‌ పోలీసు అధికారిణి తన కుటుంబాన్ని రక్షించేందుకు చేసిన పోరాటాన్ని చూపించిన క్రైమ్‌ డ్రామా చిత్రం. నటుడు రవి బాబు ప్రధాన పాత్రలో నటిస్తూ..నిర్మించారు. డైసీ బొప్పన్న, కార్తిక్‌ ఆకృతి కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని తెలంగాణ రాష్ట్ర పోలీసు మహిళా భద్రత విభాగం ఏడీజీపీ షిఖా గోయల్‌ విడుదల చేశారు. పోలీసు అధికారిణి కుమార్తె కిడ్నాప్‌ అవడం, కారు ప్రమాదంలో తన భర్త గాయపడటం లాంటి సంఘటనలతో ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తోంది ట్రైలర్‌. మరి తన కుటుంబాన్ని ఆమె ఎలా కాపాడుకుందో తెలియాలంటే ‘రష్‌’ని చూడాల్సిందే. ఈ రోజు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని