సినిమాల్లోకి రావాలని కలలేమీ కనలేదు!

‘నటన అనేది నా చిన్ననాటి కల కాదు, విధి నన్ను ఈ రంగంలో అడుగుపెట్టేలా చేసిందంతే’ అని అంటోంది మృణాల్‌ ఠాకూర్‌. వరుస అవకాశాలను అందుకుంటున్న ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాల్ని తన అభిమానులతో పంచుకుంది.

Published : 13 Jun 2024 00:44 IST

‘నటన అనేది నా చిన్ననాటి కల కాదు, విధి నన్ను ఈ రంగంలో అడుగుపెట్టేలా చేసిందంతే’ అని అంటోంది మృణాల్‌ ఠాకూర్‌. వరుస అవకాశాలను అందుకుంటున్న ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాల్ని తన అభిమానులతో పంచుకుంది. ‘నా బాల్యమంతా వివిధ పట్టణాలకు తిరగడానికే సరిపోయింది. అలా మారడం వల్ల కొత్త వాతావరణాలకి అనుగుణంగా అలవాటు పడిపోవడం బాధించలేదు. నేను దాదాపు 10నుంచి 11 పాఠశాలలు మారి ఉంటానేమో. స్కూళ్లు మారినప్పుడు ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడం అంత సులభం కాదు’ అని అంది. ‘నేను నటిగా ఎదగాలనేది నా కల కాదు. కానీ, విధి నన్ను ఈ వైపుకి నడిపించింది. అదే నన్ను డిగ్రీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ మాస్‌ మీడియా చేయడానికి దారితీసింది. అక్కడే నటన పట్ల నాకున్న అభిరుచిని తెలుసుకున్నా. ఆడిషన్స్‌ నటనపై మరింత ఆసక్తిని పెంచాయి. నేనీ రంగంలోకి రావాలని నా స్నేహితులు కూడా ఎప్పుడూ ప్రోత్సహించేవారు’ అని చెప్పుకొచ్చింది. ‘లవ్‌ సోనియా’లోని ఆమె పోషించిన పాత్ర తన నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి మాత్రమే కాదు, ప్రతి చిత్రంలో చేసే పాత్రతో మర్చిపోలేని ముద్ర వేయడానికి కారణమైందంటూ ముగించింది మృణాల్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు