మనల్ని విడదీసే వాళ్లు పుట్టలేదేమో!

‘గత 22ఏళ్లలో నేను ఈ క్షణాన్ని ఎప్పుడూ ఊహించుకోలేదు’, ‘ఇన్నేళ్లపాటు నేనీ క్షణం గురించి తప్ప మరో విషయం గురించే ఆలోచించలేదు’..

Published : 14 Jun 2024 00:26 IST

త 22ఏళ్లలో నేను ఈ క్షణాన్ని ఎప్పుడూ ఊహించుకోలేదు’, ‘ఇన్నేళ్లపాటు నేనీ క్షణం గురించి తప్ప మరో విషయం గురించే ఆలోచించలేదు’..దశాబ్దాల తర్వాత కలుసుకున్న ప్రేమికులు బసు, కృష్ణ మాట్లాడుకున్న మాటలివి. బసుగా టబు, కృష్ణ పాత్రలో అజయ్‌ దేవగణ్‌ నటించిన చిత్రమే ‘ఔరో మే కహా దమ్‌ థా’. మ్యూజికల్‌ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి నీరజ్‌ పాండే దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల కార్యక్రమం ముంబయిలో జరిగింది. ‘మనల్ని ఎవరూ విడదీయలేరు కదా! అలాంటి వాళ్లు ఇంకా పుట్టలేదేమో’ అంటూ మొదలైన ట్రైలర్‌ మలుపులతో ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. బసు, కృష్ణ ప్రేమ ముగిసిపోవడం, హత్య కేసులో కృష్ణ జైలుకు వెళ్లడం, బసుకి ఇంకొకరితో పెళ్లి జరగడం..లాంటి సంఘటనలతో ఆసక్తి కలిగిస్తోంది ట్రైలర్‌. ‘నువ్వు అడిగే ప్రతీ ప్రశ్నకు నా దగ్గర ఐదు సమాధానాలున్నాయి’, ‘తను నీకు వంద రకాల బాధలు తలపెట్టాడంటే అతడే నీ బాధకు ఉపశమనమని అర్థం’ అనే డైలాగులు చిత్రంపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ సినిమా వచ్చే నెల 5న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని