భాగ్యనగరంలో డెకాయిట్‌ యాక్షన్‌

అడివి శేష్, శ్రుతిహాసన్‌ జంటగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘‘డెకాయిట్‌’. షానీల్‌ డియో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు.

Published : 14 Jun 2024 00:28 IST

డివి శేష్, శ్రుతిహాసన్‌ జంటగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘‘డెకాయిట్‌’. షానీల్‌ డియో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్‌ నారంగ్‌ సహ నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర సెట్‌లోకి శ్రుతి అడుగు పెట్టింది. ఈ విషయాన్ని శ్రుతితో పాటు చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. ఈ షెడ్యూల్‌లో భాగంగా శేష్, శ్రుతిలపై భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ‘‘ఇది ఇద్దరు మాజీ ప్రేమికుల కథగా ఉంటుంది. వాళ్లు తమ జీవితాలను మార్చుకోవడానికి వరుస దోపిడీల కోసం మళ్లీ చేతులు కలపాల్సి వస్తుంది. మరి ఆ ప్రయాణం ఎలా సాగింది.. ఎదురైన సవాళ్లేంటన్నది ఆసక్తికరం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. అడివి శేష్‌ దీనికి స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని