ఆట ఆగస్టులో!

సినిమాల విడుదలకు ప్రత్యేకమైన రోజుల్నే ఎక్కువగా ఎంచుకుంటారు దర్శకనిర్మాతలు. ఆ రోజు కోసం పలు చిత్రాలు విడుదల కోసం పోటీ పడుతుంటాయి.

Published : 14 Jun 2024 00:30 IST

సినిమాల విడుదలకు ప్రత్యేకమైన రోజుల్నే ఎక్కువగా ఎంచుకుంటారు దర్శకనిర్మాతలు. ఆ రోజు కోసం పలు చిత్రాలు విడుదల కోసం పోటీ పడుతుంటాయి. అందులో ఏ ఒక్కటి తప్పుకున్నా..ఆ స్థానాన్ని మరో సినిమా భర్తీ చేస్తుంది. ఇప్పుడీ తరహాలోనే బాలీవుడ్‌ చిత్రం ‘ఖేల్‌ ఖేల్‌ మే’ రానుంది. అక్షయ్‌ కుమార్, తాప్సి, వాణీ కపూర్‌ తదితరులు నటించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ఇది. ముదస్సర్‌ అజీజ్‌ తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబరు 6న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం ఒక నెల ముందుగానే, అంటే ఆగస్టు 15న రానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది తాప్సి. ‘ఆగస్టు 15న నవ్వులు పూయిస్తూ..వినోదాన్ని పంచే మ్యాడ్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉండండి. ‘ఖేల్‌ ఖేల్‌ మే’ వచ్చేది ఆరోజే. క్యాలెండర్‌లో మార్క్‌ చేసుకోండి’ అంటూ వ్యాఖ్యల్ని జోడించిందీమె. ప్రస్తుతం ‘వో లడ్కీ హే కహా?’, ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’ లాంటి చిత్రాలతో బిజీగా ఉంది తాప్సి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని