లేడీ బాస్‌.. నీరా వాసుదేవ్‌

నితిన్‌ హీరోగా వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Published : 15 Jun 2024 00:18 IST

నితిన్‌ హీరోగా వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రీలీల కథానాయిక. శుక్రవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి తన ఫస్ట్‌లుక్, గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఆ ప్రచార చిత్రంలో శ్రీలీల స్టైలిష్‌ లుక్‌లో తన ప్రైవేట్‌ జెట్‌ నుంచి కిందకి దిగడం కనిపించింది. ‘‘జ్యోతీ.. సునామీలో టి సైలెంట్‌గా ఉండాలి. నా ముందు నువ్వు సైలెంట్‌గా ఉండాలి’’ అంటూ ఆ వీడియోలో శ్రీలీల చెప్పిన డైలాగ్‌ అలరించింది. ఈ చిత్రంలో ఆమె లేడీ బాస్‌ నీరా వాసుదేవ్‌ అనే పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకి సంగీతం: జీవీ ప్రకాశ్‌ కుమార్, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని