‘ఏ’.. ఈతరం ప్రేక్షకుల్నీ షాక్‌కు గురిచేస్తుంది

ఉపేంద్ర కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘ఏ’. ఈ సినిమా ఈ నెల 21న తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్‌ కానుంది.

Published : 16 Jun 2024 01:00 IST

పేంద్ర కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘ఏ’. ఈ సినిమా ఈ నెల 21న తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు ఉపేంద్ర మాట్లాడుతూ.. ‘‘ఇది నా జీవితంలో మర్చిపోలేని సినిమా. 26 ఏళ్ల క్రితం ఈ చిత్రం విడుదలవుతున్నప్పుడు ఎంత ఉత్సాహంగా ఎదురు చూశానో.. ఇప్పుడూ అదే ఉత్సాహంతో ఉన్నా. ఈ సినిమాని చూసి ఈతరం ప్రేక్షకులు కూడా షాక్‌ అవుతార’’న్నారు. ‘‘ఈ చిత్రం రీరిలీజ్‌ సందర్భంగా ఒక బైట్‌ ఇవ్వండని ఉపేంద్రను అడిగితే.. ఏకంగా హైదరాబాద్‌కు వచ్చి మాట్లాడతానని చెప్పి మంచితనం చాటుకున్నారు’’ అన్నారు నిర్మాత సైదులు. ఈ కార్యక్రమంలో లింగం తదితరులు పాల్గొన్నారు.


మంచి సినిమా తీశారని ప్రశంసిస్తున్నారు 

రోం హర’తో థియేటర్లలో సందడి చేస్తున్నారు సుధీర్‌బాబు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కించారు. సుమంత్‌ జి.నాయుడు నిర్మించారు. సునీల్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సుమంత్‌ జి.నాయుడు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ద్వారా సుధీర్‌తో కలిసి పని చేయడం బాగుంది. ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది. మంచి చిత్రం తీశారని అందరూ ప్రశంసిస్తున్నారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలోని తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌ బాగా నచ్చి దీన్ని చేయాలనుకున్నాం. అలాగే ఫైట్స్‌ కూడా బాగా నచ్చాయి. వాటి కోసమే సినిమాని దాదాపు 13సార్లు చూశా’’ అన్నారు నిర్మాత సుబ్రహ్మణ్యం. 


ఆ వసూళ్లు  ఆనందాన్నిస్తున్నాయి

శ్‌ హీరోగా కెవి.రాజు తెరకెక్కించిన అనువాద చిత్రం ‘రాజధాని రౌడీ’. ఈ సినిమా ఇటీవల తెలుగులో విడుదలైన నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘మా చిత్రానికి అన్ని థియేటర్స్‌ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. హైదరాబాద్‌తో పాటు బీ, సీ సెంటర్లలో వసూళ్లు బాగున్నాయి. మేము పెట్టిన పెట్టుబడికి వస్తున్న వసూళ్లు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో దీనికి ప్రేక్షకుల నుంచి మరింత ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో టి.ప్రసన్న కుమార్, సంజీవి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


గోదారి ప్రేమ 

దన్, ప్రియాంక ప్రసాద్‌ జంటగా పీఎల్‌ విగ్నేశ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ప్రణయ గోదారి’. పారమళ్ల లింగయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి విడుదల చేశారు. అనంతరం దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘టైటిల్‌కు తగ్గట్లుగానే దీంట్లో గోదావరి అందాలు.. అక్కడి ప్రజల జీవన విధానాలు కనిపిస్తాయి’’ అన్నారు. 


సెట్టవుతుందా పెయిరు.. 

రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా జె.శివసాయి వర్ధన్‌ తెరకెక్కించిన చిత్రం ‘భలే ఉన్నాడే’. ఎన్‌.వి.కిరణ్‌ కుమార్‌ నిర్మించారు. మనీషా కంద్కూర్‌ కథానాయిక. సింగీతం శ్రీనివాస్, అభిరామి, వీటీవీ గణేశ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాలోని రెండో పాటను శనివారం విడుదల చేశారు. ‘‘సెట్టవుతుందా పెయిరు.. రైటో రాంగో వీరు.. మిస్టరి వీడేదెప్పుడో’’ అంటూ సాగిన ఈ పాటకు శేఖర్‌ చంద్ర స్వరాలు సమకూర్చగా.. కృష్ణకాంత్‌ సాహిత్యమందించారు. కపిల్‌ కపిలన్‌ ఆలపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు