ఈ చిత్రంలో పాత్రల ముఖాలు కనిపించవు!

సుగి విజయ్, మౌనిక మగులూరి జంటగా బి.శివప్రసాద్‌ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం ‘రా రాజా’. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 16 Jun 2024 01:06 IST

సుగి విజయ్, మౌనిక మగులూరి జంటగా బి.శివప్రసాద్‌ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం ‘రా రాజా’. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హీరో అల్లరి నరేశ్‌ ఈ చిత్ర టీజర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ కథ నేను విన్నా. చాలా ఆసక్తికరంగా అనిపించింది. దీంట్లో ఉన్న విశేషమేంటంటే ఇందులో నటించిన 24మంది పాత్రల ముఖాలు కనిపించవు. ఏఐ జనరేషన్‌లో ఇలాంటి ప్రయోగం చేయడం సాహసమే. కచ్చితంగా ఈ సినిమా ట్రెండ్‌ సెట్‌ చేస్తుందనిపిస్తోంది’’ అన్నారు. ఈ సినిమాకి శేఖర్‌ చంద్ర సంగీతమందిస్తున్నారు. రాహుల్‌ శ్రీవాత్సవ్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని