‘పుష్ప 2’ తేదీకే ‘డబుల్‌ ఇస్మార్ట్‌’

‘డబుల్‌ ఇస్మార్ట్‌’ విడుదల ఖరారైంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్నట్లుగానే ‘పుష్ప 2’ విడుదల తేదీనే ఈ పాన్‌ ఇండియా చిత్రం లక్ష్యం చేసుకుంది.

Published : 16 Jun 2024 01:09 IST

బుల్‌ ఇస్మార్ట్‌’ విడుదల ఖరారైంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్నట్లుగానే ‘పుష్ప 2’ విడుదల తేదీనే ఈ పాన్‌ ఇండియా చిత్రం లక్ష్యం చేసుకుంది. ఈ మేరకు ఆగస్టు 15న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటిస్తూ చిత్ర వర్గాలు శనివారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశాయి. ఇది రామ్‌ - పూరి జగన్నాథ్‌ల కలయికలో వస్తున్న రెండో సినిమా. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌గా రూపొందుతోంది. దీంట్లో కావ్య థాపర్‌ కథానాయికగా కనిపించనుండగా.. సంజయ్‌ దత్, అలీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ‘పుష్ప 2’ వాయిదా పడనున్నట్లు ప్రచారం వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడదే తేదీకి ఈ చిత్రం వస్తుండటం ఆ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు