ఎన్టీఆర్‌ పురస్కారాలు 29న ప్రదానం

కళావేదిక ఎన్టీఆర్‌ ఫిలిం అవార్డ్స్‌ వేడుకని ఈ నెల 29న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. కళావేదిక, రాఘవి మీడియా సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో సినిమా రంగంలోని వివిధ విభాగాలకు చెందిన కళాకారులకు పురస్కారాల్ని ప్రదానం చేయనున్నారు.

Published : 17 Jun 2024 01:05 IST

ళావేదిక ఎన్టీఆర్‌ ఫిలిం అవార్డ్స్‌ వేడుకని ఈ నెల 29న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. కళావేదిక, రాఘవి మీడియా సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో సినిమా రంగంలోని వివిధ విభాగాలకు చెందిన కళాకారులకు పురస్కారాల్ని ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకకి సంబంధించిన పోస్టర్‌ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకి చెందిన పలువురు ప్రముఖులు ఇందులో పాల్గొననున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని