‘సితారే జమీన్‌ పర్‌’ ముగిసింది

బుద్ధిమాంద్యం పిల్లల్లోని అసాధారణ ప్రతిభను వెలికితీయాలనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘తారే జమీన్‌ పర్‌’.

Published : 17 Jun 2024 01:07 IST

బుద్ధిమాంద్యం పిల్లల్లోని అసాధారణ ప్రతిభను వెలికితీయాలనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘తారే జమీన్‌ పర్‌’. ఆమిర్‌ఖాన్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి విజయంతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీనికి కొనసాగింపుగా ‘సితారే జమీన్‌ పర్‌’ను ఆర్‌ఎస్‌ ప్రసన్న తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమిర్‌ఖాన్‌ సరసన జెనీలియా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ ముగిసినట్లు తెలిపింది చిత్రబృందం. ‘‘విజయవంతంగా షూటింగ్‌ పూర్తి చేశాం. ఇంతకుముందు చిత్రం ప్రేక్షకుల హృదయాలను బరువెక్కిస్తే.. ఈ సీక్వెల్‌ అందరినీ నవ్విస్తుంద’’ని వ్యాఖ్యానించారు. దర్శీల్‌ సఫారీ కీలక పాత్ర పోషిస్తున్న ఈ ప్రాజెక్టును ఆమిర్‌ఖాన్‌ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్‌కు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని