అలియాతో తెర పంచుకోవడం పెద్ద బాధ్యత!

అలియాతో కలిసి నటించడం పెద్ద బాధ్యతగా భావిస్తున్నానంటోంది బాలీవుడ్‌ కథానాయిక శార్వరీ వాఘ్‌. ఇటీవలే విడుదలైన ‘ముంజ్యా’లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె.. త్వరలో ఓ యాక్షన్‌ చిత్రంలో మెరుపులు మెరిపించడానికి సిద్ధమవుతోంది.

Updated : 17 Jun 2024 01:10 IST

లియాతో కలిసి నటించడం పెద్ద బాధ్యతగా భావిస్తున్నానంటోంది బాలీవుడ్‌ కథానాయిక శార్వరీ వాఘ్‌. ఇటీవలే విడుదలైన ‘ముంజ్యా’లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె.. త్వరలో ఓ యాక్షన్‌ చిత్రంలో మెరుపులు మెరిపించడానికి సిద్ధమవుతోంది. శార్వరీ, అలియాభట్‌ ప్రధాన పాత్రలో యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా విశేషాలు పంచుకుందామె. ‘‘ఇప్పటివరకు వైఆర్‌ఎఫ్‌ స్పై యూనివర్స్‌లో ఎన్నో చిత్రాలు వచ్చినా.. ఎప్పుడూ అగ్ర కథానాయకులే ఆ బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. ఇప్పుడా అవకాశం తొలిసారి మమ్మల్ని వరించింది. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న తొలి మహిళా ప్రాధాన్య యాక్షన్‌ చిత్రమిది. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించాను. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో కథానాయికలు భిన్నమైన పాత్రలను, కథలను ఎంచుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. పరిశ్రమలో ఇదొక కీలకమైన సమయమని అనుకుంటున్నాను. అద్భుతమైన నటి అలియాతో కలిసి పని చేయడం చాలా గొప్ప విషయం. దీన్ని పెద్ద బాధ్యతగా భావిస్తున్నాన’’ని చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైనట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని