భావోద్వేగానికి గురిచేసిన స్పందన ఇది

‘‘తెలుగు ప్రేక్షకులు ఎక్కడ ఎదురైనా సరే... ‘96’ మొదలుకొని ‘ఉప్పెన’ వరకూ నేను నటించిన చిత్రాలన్నింటినీ గుర్తు చేస్తూ మెచ్చుకుంటుంటారు. నాపై చూపిస్తున్న ప్రేమకు ఎంతో కృతజ్ఞుడిని. ‘మహారాజ’కి వస్తున్న అద్భుతమైన స్పందన ఎంతో ఆనందాన్నిచ్చింది’’ అన్నారు విజయ్‌ సేతుపతి.

Updated : 18 Jun 2024 04:15 IST

‘‘తెలుగు ప్రేక్షకులు ఎక్కడ ఎదురైనా సరే... ‘96’ మొదలుకొని ‘ఉప్పెన’ వరకూ నేను నటించిన చిత్రాలన్నింటినీ గుర్తు చేస్తూ మెచ్చుకుంటుంటారు. నాపై చూపిస్తున్న ప్రేమకు ఎంతో కృతజ్ఞుడిని. ‘మహారాజ’కి వస్తున్న అద్భుతమైన స్పందన ఎంతో ఆనందాన్నిచ్చింది’’ అన్నారు విజయ్‌ సేతుపతి. ఆయన కథానాయకుడిగా... నితిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. జగదీష్‌ పళనిసామి నిర్మించారు. ఈ చిత్రాన్ని ఎస్‌.వి.ఆర్‌ సినిమా సంస్థ తెలుగులో విడుదల చేసింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సోమవారం హైదరాబాద్‌లో విజయోత్సవాన్ని నిర్వహించింది. దర్శకులు మారుతి, గోపీచంద్‌ మలినేని, బుచ్చిబాబు సానా, అనిల్‌ కన్నెగంటి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ ‘‘నన్ను భావోద్వేగానికి గురిచేసిన స్పందన ఇది. సినిమా గురించి అందరూ ఇంత గొప్పగా మాట్లాడటం ఎంతో తృప్తినిచ్చింది’’ అన్నారు. చిత్ర దర్శకుడు నితిలన్‌ స్వామినాథన్‌ మాట్లాడుతూ ‘‘కథ, స్క్రీన్‌ప్లే, నటన... ఇలా ప్రతి విషయం గురించీ తెలుగు ప్రేక్షకులు మాట్లాడటం ఎంతో సంతోషాన్నిచ్చింది. సినిమాని ఇంతగా ప్రేమిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ ‘‘మాస్టర్‌ పీస్‌ అనదగ్గ ఓ గొప్ప సినిమా ఇది. చాలా అరుదుగా వస్తుంటాయి ఇలాంటివి. విజయ్‌ సేతుపతి ఈ తరంలో ఓ గొప్ప నటుడు’’ అన్నారు. గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ ‘‘ఈమధ్యకాలంలో నేను చూసిన మంచి సినిమా ఇది. ఒక జీవితాన్ని తెరపై చూసిన అనుభూతి కలిగింది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో మైత్రీ శశిధర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు