చారిత్రక కట్టడాల్లో పతాక సన్నివేశాలు

Updated : 18 Jun 2024 06:15 IST

'భూల్‌ భులయ్యా 3్ఠలో రూహ్‌ బాబాగా మరోసారి మ్యాజిక్‌ చేయడానికి సిద్ధమవుతున్నాడు కార్తిక్‌ ఆర్యన్‌. 'భూల్‌ భులయ్య్ఠా ఫ్రాంచైజీలో వస్తున్న ఈ మూడో భాగానికి అనీస్‌ బజ్మీ దర్శకత్వం వహిస్తున్నారు. భూషణ్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. ఇందులో కార్తిక్‌ ఆర్యన్‌తో త్రిప్తి దిమ్రీ ఆడిపాడనుంది. తాజాగా కీలక షెడ్యూల్‌ చిత్రీకరణ కోసం కార్తిక్‌ ఆర్యన్, త్రిప్తి దిమ్రీ సహా ఇతర తారాగణం మధ్య ప్రదేశ్‌కి బయల్దేరినట్టు సినీవర్గాలు తెలిపాయి. ‘ముంబయి, కోల్‌కతాల్లో ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ జరుపుకొని, ప్రధాన షెడ్యూల్‌ కోసం మధ్యప్రదేశ్‌లోని పురాతన పట్టణం ఓర్చా చేరుకున్నాం. ఇక్కడ పలు చారిత్రక కట్టడాల్లో పతాక సన్నివేశాలు తెరకెక్కిస్తాం. జులై వరకు షూటింగ్‌ కొనసాగించి, చిత్రీకరణ ముగించనున్నాం’ అని సన్నిహితవర్గాలు తెలిపాయి. విద్యాబాలన్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సీనియర్‌ నటి మాధురి దీక్షిత్‌ అతిథి పాత్రలో మెరవనుంది. దీపావళికి ఈ సినిమా విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని