హైదరాబాద్‌ హత్యాచార కేసు... కరీనా కొత్త కథ?

కొన్ని నెలల క్రితం ‘క్రూ’తో అలరించింది బాలీవుడ్‌ కథానాయిక కరీనా కపూర్‌. 25ఏళ్లుగా సినీ రంగంలో రాణిస్తూ...ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈమె ప్రస్తుతం ‘సింగమ్‌ అగైన్‌’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Published : 19 Jun 2024 00:54 IST

కొన్ని నెలల క్రితం ‘క్రూ’తో అలరించింది బాలీవుడ్‌ కథానాయిక కరీనా కపూర్‌. 25ఏళ్లుగా సినీ రంగంలో రాణిస్తూ...ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈమె ప్రస్తుతం ‘సింగమ్‌ అగైన్‌’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీపావళికి విడుదలకు సిద్ధమైన ఆ సినిమా తర్వాత కరీనా ఎలాంటి ప్రాజెక్టుతో వస్తుందోనన్న ప్రశ్న అభిమానుల్లో మొదలైంది. ఆ ప్రశ్నలకు సమాధానంగా.. తాజాగా ఈ సుందరి వాస్తవ సంఘటనల ఆధారంగా రానున్న ఓ సినిమాలో ప్రధాన పాత్ర పోషించనున్నట్లు తెలిసింది. ‘ఛపాక్‌’, ‘రాజీ’ లాంటి మహిళా ప్రాధాన్య సినిమాలను రూపొందించిన మేఘనా గుల్జర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారట. హైదరాబాద్‌లో జరిగిన హత్యాచార కేసు నేపథ్యంలో ఆ చిత్రం తెరకెక్కనున్నుట్లు సమాచారం. ఇందులో ఆయుష్మాన్‌ ఖురానా కీలక పాత్రలో కనిపించనున్నారని  తెలుస్తోంది. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమా చిత్రీకరణని ఈ ఏడాది చివరినాటికి మొదలుపెట్టేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని