అజర్‌బైజాన్‌కు అజిత్‌

తమిళ అగ్ర కథానాయకుడు అజిత్‌ రెండు సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇటీవలే ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసిన ఆయన.. ఇప్పుడు ‘విదాముయార్చి’ని ముగించేందుకు సిద్ధమయ్యారు.

Published : 19 Jun 2024 00:56 IST

మిళ అగ్ర కథానాయకుడు అజిత్‌ రెండు సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇటీవలే ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసిన ఆయన.. ఇప్పుడు ‘విదాముయార్చి’ని ముగించేందుకు సిద్ధమయ్యారు. తిరుమేని దర్శకత్వంలో ముస్తాబవుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్ర ఆఖరి షెడ్యూల్‌ ఈనెల 24నుంచి అజర్‌బైజాన్‌ రాజధాని బాకులో మొదలు కానుందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో భాగంగా అజిత్‌పై భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. అర్జున్, రెజీనా, సంజయ్‌ దత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతమందిస్తుండగా.. నీరవ్‌ షా, ఓం ప్రకాశ్‌ ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని