గుజరాత్‌లో లూసిఫర్‌ యాక్షన్‌

ప్రయోగాత్మక కథలు, వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంటారు మలయాళ అగ్రకథానాయకుడు మోహన్‌లాల్‌. త్వరలో ఆయన ‘లూసిఫర్‌2:ఎంపురాన్‌’తో తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నారు.

Published : 19 Jun 2024 00:58 IST

ప్రయోగాత్మక కథలు, వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంటారు మలయాళ అగ్రకథానాయకుడు మోహన్‌లాల్‌. త్వరలో ఆయన ‘లూసిఫర్‌2:ఎంపురాన్‌’తో తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నారు. మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కొచ్చిలో ఓ షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్నట్లు తెలిపింది చిత్రబృందం. తాజాగా గుజరాత్‌లో మళ్లీ షూటింగ్‌ను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ సినిమాకి కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నట్లు సమాచారం. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఖురేషి అబ్రహం పాత్రలో కనిపించనున్నారు మోహన్‌లాల్‌. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మంజూ వారియర్, టొవినో థామస్, అర్జున్‌దాస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని