నిద్రపోనివ్వని కలే సర్ఫిరా

‘‘కేవలం ఒక్క రూపాయి జేబులో పెట్టుకుని ఎగరాలని కలలు కనే సామాన్యుడిని నేను’’ అంటున్నాడు ఓ వ్యక్తి. మరి ఆయన లక్ష్యమేంటి..? దాని కోసం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడో తెలుసుకోవాలంటే ‘సర్ఫిరా’ చూడాల్సిందే.

Published : 19 Jun 2024 01:00 IST

‘‘కేవలం ఒక్క రూపాయి జేబులో పెట్టుకుని ఎగరాలని కలలు కనే సామాన్యుడిని నేను’’ అంటున్నాడు ఓ వ్యక్తి. మరి ఆయన లక్ష్యమేంటి..? దాని కోసం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడో తెలుసుకోవాలంటే ‘సర్ఫిరా’ చూడాల్సిందే. బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో సుధా కొంగర తెరకెక్కిస్తున్న చిత్రమిది. మంచి విజయాన్ని అందుకున్న ‘సూరారై పోట్రు’ (ఆకాశమే నీ హద్దురా) చిత్రానికి రీమేక్‌. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఇన్‌స్టా వేదికగా విడుదల చేశారు అక్షయ్‌. ‘నిద్రపోయేటప్పుడు వచ్చేవి కలలు కాదు. నిద్రపోనివ్వనివే అసలైన కలలు. అలాంటి కథే సర్ఫిరా’ అని వ్యాఖ్యల్ని జోడించారు. ఇందులో అనుకున్నది సాధించాలని పరితపిస్తున్న వీర్‌ అనే పాత్రలో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు అక్షయ్‌. ‘‘ప్రతి సామాన్యుడు ఆకాశాన్ని తాకాలనేది నా కోరిక, రెక్కలున్న ప్రతి పక్షి ఎగరదు’’ లాంటి సంభాషణలతో ఆద్యంతం ఆసక్తిగా సాగుతోంది ఈ ట్రైలర్‌. ఈ సినిమా జులై 12న రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని