వెట్రిమారన్‌ చిత్రంలో రుహానీ

‘చిలసౌ’, ‘హిట్‌’, ‘సైంధవ్‌’ చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన నటి రుహానీ శర్మ. ఇప్పుడామె తమిళంలో ఓ క్రేజీ అవకాశాన్ని దక్కించుకుంది. ప్రముఖ దర్శకుడు వెట్రి మారన్‌ నిర్మిస్తున్న ‘మాస్క్‌’లో ఓ నాయికగా కనిపించనుంది.

Published : 24 Jun 2024 00:55 IST

‘చిలసౌ’, ‘హిట్‌’, ‘సైంధవ్‌’ చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన నటి రుహానీ శర్మ. ఇప్పుడామె తమిళంలో ఓ క్రేజీ అవకాశాన్ని దక్కించుకుంది. ప్రముఖ దర్శకుడు వెట్రి మారన్‌ నిర్మిస్తున్న ‘మాస్క్‌’లో ఓ నాయికగా కనిపించనుంది. ‘డాడా’, ‘స్టార్‌’ విజయాల తర్వాత కవిన్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. వెట్రి మారన్‌ శిష్యుడు విక్రనన్‌ అశోక్‌ తెరకెక్కిస్తున్నారు. ఆండ్రియా ఓ కథానాయికగా నటిస్తోంది. మరో నాయిక పాత్రను రుహానీ పోషిస్తోంది. ఆమె ఇప్పటికే ఈ చిత్ర సెట్స్‌లోకి అడుగు పెట్టింది. దీనికి సంబంధించి ఓ వర్కింగ్‌ స్టిల్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. ఇదొక భిన్నమైన డార్క్‌ కామెడీ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్నట్లు తెలిసింది. ఈ ఏడాది చివరి నాటికి చిత్రీకరణ పూర్తి చేసి.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని